పుట:వెలుగోటివారి వంశావళి.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

వెలుగోటివారి వంశావళి


సామిచ్చి బలుజెట్టిఁ[1] జంపి నాతనియన్న
        యన్నల్లదేవుని యనుఁగు[2]పట్టి
పట్టెముల్ చెఱసాలఁ బెట్టిన దొరమావు
        మావులపూవిల్తు మామకొమరు[3]
కొమరుమాటలకు మార్గొట్టిన[4] రాపగ
        పగఠేవ[5] పేరుబ్బు వాయుపాలు
పాలు గెల్పునఁ గొన్న నేర్పరి వలమురి
మురిపెమున వేల్పుపెద్దను మోచు పులుఁగు
పులుఁగుచెప్పెడితపసిచే పుడుకురాయి
రాయతిరుపతితిమ్మ నీఱాఁగయశము.

319


సీ.

ఉబ్బురెప్పలు విచ్చి బిబ్బిన సొరనేర్చి[6]
        యూరుపుగాలికి[7] నోసరిలదు
కవుడుదేరుకవాసనవుర చేతుల నప్ప
        ళించి స[8]గ్గటనిటఁ గొంచెపడదు
కైఁజుట్టుకొన్న సైకపుకసీదు రుమాలు[9]
        తుడుపులకోడి[10] గొందులకు డిగదు

  1. A.B. జట్టి
  2. A. యన్నల్లదేవర యశుపట్టి; B. యన్నల్లదేవర యడుగపట్టి
  3. B. మామరుకొమారు
  4. B. మాటలకుమార్గాట్టిన
  5. A.B. ఠేవ పెరుబ్బు
  6. A.B. నొరనేర్చి
  7. A. ఖాలి; B. భావి
  8. A.B. కపుడు దేరుకవాసన పురచేతులనప్పళించి సగ్యట నిటకొంచపడదు
  9. A.B. కశిదురూమాలు
  10. A. గొరకు; B. గొడకు