పుట:వెలుగోటివారి వంశావళి.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

107


పతి జనతానతులై [ధర]
నుతి కెక్కిరి[1] రామలక్ష్మణుల చందమునన్.

313


వ.

సంతతికిఁ దిరుపతినేఁడు మొదలు.

314


క.

కురుపతి మానోన్నతికి న[2]
మరపతి తద్ఘట్టితారిమహిమను[3] విలస
ద్గురునకుఁ బ్రతి మతి[4] [గిరిపతి]
తిరుపతినరపతి మహాధృతిన్ నుతికెక్కెన్.

315


క.

తిరుపతినరపతి యల దా
మర[5]ధర్మక్షోణిపతికొమారిత ధర్మాం
బ రమాసమఁ బరిణయమై
పరఁగన్[6] బినకొండతిమ్మప్రభువులఁ గనియెన్[7].

316


వ.

అందగ్రజుండు.

317


చ.

తిరుపతినేనికొండజగతీతలనాథు మహోగ్రథాటికా
తురగఖురోత్థభూరజము దూరవిరాగముఖోజ్వల[8]ద్ద్విష
త్కరిగమనాపరంపరకుఁ గంచెలయై పటవాసమై మనో
హరపరిధానమై యహరహం బలుకించుఁ[9] దదీయవల్లభున్.

318


సీ.

నలువనెమ్మోముమేడలనాడు[10] తెలిపాప,
        పాఁపజందెమునఁ జూపటుసామి

  1. A.B. నుతు లొప్పిరి
  2. A.B. వను
  3. A.B. మరుపతి తద్భైత్రుతారి మహిపతి
  4. A.B. ప్రతినది తిరుపతి
  5. A.B. దామెర
  6. A.B. వరసుతు
  7. A.B. ప్రభుగనియెన్
    Though Pinakoṇḍa and Timma are mentioned in this stanza as the only sons of Tirupati, he had also two other sons, Ranga and Kṛṣṇa, whose valour is described below in stanzas 322-327
  8. A.B. దూరతిరాగముఖాజ్వల
  9. A.B. యహరహంబులకించు
  10. A.B. మెడల