పుట:వెలుగోటివారి వంశావళి.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

వెలుగోటివారి వంశావళి


డనుచు జగములు వొగడంగ నలరుచుండు
సమదవిమతవసుంధరారమణసింధు
మంథ[1]జగతీధరేంద్రాయమానబాహు
దండబలహారి వెలుగోటికొండశౌరి.

306


ఆ.

ఇలఁ బ్రసిద్ధిగన్న యీపదుగుండ్రలో[2]
పలఁ గుమారతిమ్మపార్థివుండు
కొండవిభుఁడు రాయమండలపతియేచ
ధీధనుండు పిన్నతిమ్మనయును.

307


వ.

కుమారవంతులై వర్ధిల్లి రందు.

308


చ.

ధరణిఁ గుమారతిమ్మవసుధాపతి లక్కమదేవిఁ బెండ్లియై
శరధిశయాను భూరిభుజసాగరవేదములంచు నెన్నఁగాఁ
దిరుపతినేని కొండజగతీరమణున్ బెదవేంకటావనీ
శ్వరుఁ జినవేంకటాధిపరసారమణుం గనియెన్ గ్రమంబునన్.

309


క.

నిరవధికలక్ష్మి నీప్సిత[3]
పరదానగుణాతివైభవమున ధరిత్రిన్
దిరుపతినాయకుఁ డొప్పున్
దిరుపతినాయఁకునిభంగిఁ దేజోధికుఁడై.

310


వ.

అతనియనుజుండు.

311


మ.

పినకొండక్షితిపాలశేఖరుభుజాభీలప్రతాపాగ్ని వై
రినికేతంబులు సొచ్చుఁ దచ్చతురనారీభూరిధమ్మిల్లబం
ధనముల్ నెవ్వడి వీడ్చు నాననసుగంధం బౌనుఁ జుంబించు న
క్కున రాయున్ వలువూడ్చు[4] జన్నుఁగవ నొక్కున్ బల్లవప్రక్రియన్.

312


క.

అతనియనుజాతు లార్యా
ర్చితు లాపెదవేంకటయ్య చినవేంకటభూ

  1. A.B. మంధ
  2. A.B. పరగ బ్రసిద్ధిగన్న యీ పదుగిండ్రలో
  3. A.B. లక్ష్మీప్సిత
  4. A.B. వలపూడ్చు