పుట:వెలుగోటివారి వంశావళి.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

105


నయ మెఱుంగఁడు ప్రజాక్షయకారి నడవడి
        చక్కఁగా దెంతయు[1] నిక్కులాఁడు
గబ్బి క్రూరుఁడు భయంకరుఁడు దబ్బఱకాఁడు
        గణుతింపఁ బెక్కు నాల్కలుగలాఁడు[2]
శేషుఁ డని రోసి భూకాంత చేరి యాడు[3]
ప్రేమ మీఱంగ నీబాహు[4]పీఠమందు
భవ్యచారిత్ర కొండభూపాలుపుత్ర
ధీరతాటోప వెలుగోటితిమ్మభూప.

303


క.

అమ్మనుజనాథుకూరిమి
తమ్ముఁడు పెదతిమ్మభూమిధవుఁ డుగ్రసమి
త్సమ్మూర్ఛితభూభువనక
కుమ్మద[5]వద్వీరవైరికులుఁడై వెలసెన్.

304


క.

వినుతనయవినయ రేఖా
తనుఁడగు[6] పెదతిమ్మవిభుని తమ్ముఁడు వెలయున్
బినతిమ్మక్షోణీపతి
ఘనదానత్యాగవిజితకల్పక మగుచున్.

305


*సీ.

కలధౌతకలధౌతకలధౌతనిలయుండు
        ఘనసారఘనసారగంధయుతుఁడు
నరసింహనరసింహనరసింహశౌర్యుండు
        భారతిభారతిపాటవుండు
వాహినీవాహినీవాహినీశ్వరమంత్రి
        సుకుమారసుకుమారశోభితుండు
మణిరాజమణిరాజమణిరాజనిభకీర్తి
        కల్యాణకల్యాణకలితతేజుఁ

  1. A.B. దింతయు
  2. A.B. ప్రణుతింప పెక్కు నాలుకలవాడు
  3. A.B. యాడి
  4. A.B. మీబాహు
  5. B. క | కున్మద
  6. A.B. ఘనుడగు