పుట:వెలుగోటివారి వంశావళి.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

వెలుగోటివారి వంశావళి


పన్నగాననముక్తపవనంబు శీతమె
సేదార్చుకొనఁగ నోసింహమధ్య
యహహ వశమె పురాకృత మవఘళింప[1]
ననుచు సఖి పల్కు నీశత్రు నబలఁ దెలియ
సమరరఘురామ రేచర్లసార్వభౌమ
కొండభూపాలయేచభూమండలేంద్ర.

300


*సీ.

జంభారితనుజాత జంభారితనుజాత
        సమభోగరూపశౌర్యములవాఁడు
గంధవాహకుమార గంధవాహకుమార
        సమవేగశక్తిసత్వములవాఁడు
కుంభినీధరరాజ కుంభినీధరరాజ
        సమరమాశౌభ్ర్య[2]ధైర్యములవాఁడు
రాజశేఖరమిత్ర రాజశేఖరమిత్ర
        సమభూతిరుచినిధానములవాఁడు
జగతి నితఁడనఁ బరఁగుఁ బ్రస్థానసమయ
కల్పితాభీల[3]పటహభాంకారనినద
ఘటితపటుకర్ణకుహరదిక్తటమదావ
ళేశ్వరుండైన[4] యేచధాత్రీశ్వరుండు.

301


మ.

అతనియనుజుండు.

302


సీ.

చెలపాది[5] కుటిలుండు చేఁదు[6] పుక్కిటనుండుఁ
        జుట్టుగాఁ దిరుగాడుఁ బుట్టనుండుఁ[7]
బామరిరాలలోఁ బడి పావనుఁడుగాఁడు[8]
        నిర్దయుం డేప్రొద్దు నిద్రపోతు

  1. A. పురాకృతంబౌ భరింప
  2. A.B. శౌర్య
  3. B.P. కల్పితాఖిల
  4. B.P. మదాపధీశ్వరుండైన
  5. A.B. 'చదిపాద'. 'చలపాది' సరియైన రూపము
  6. A.B. చెందు
  7. A.B. చుట్టులాడిది గాదు పుట్టగుండు
  8. A.B. పామరిరాలలో ( A. మో) పరిపవనుడుగాడు