84
వెలుగోటివారి వంశావళి
ఘనతన్ బర్వతకందరస్థలమునన్[1] గాల్నిల్పి[2] పైకొన్నచోఁ గినుకన్ గన్నడరాయఘోటమృగపంక్తిన్ గూల్చె నుద్వృత్తిమైఁ జెనకెన్ మత్తమతంగజప్రభు నదల్చెన్ రామఱే నేపునన్[3] గనితిమ్మక్షితిపాలసింహుఁ బొగడంగాఁ బోలదే[4] యేరికిన్.
కల్పవృక్షంబులు గణుతింపఁ బడెఁ జెట్ల[5] వడిఁ గామధేనువు వట్టిపోవు[6] తుది నప్పువడి గాలి[7] దూలె నామేఘుండు రమణఁ జింతామణి రాతిగుండు[8] పాతాళగతుఁ డయ్యె బలిచక్రవర్తి దా భావింపఁ జంద్రుఁడు పక్షపాతి యర్కనందనుఁడు దా నరయ దరిద్రుండు[9] శిబిమేని మాంసంబు చెప్ప రోఁత యిట్టి దాతలవితరణ లేల చెప్ప[10] నిన్నుఁ గొనియాడఁ దగుఁ గాని నేర్పుతోడ నర్థి దారిద్ర్యతిమిర దోషాపహరణ దినకరాటోప[11] వెలుగోటి తిమ్మభూప.
గోపతితుల్యభోగ వెలుగోటిపురీంద్రకుమారతిమ్మ [నీ] రూపము విక్రమాంకు[12] నిజరూపముగాక మనుష్యరూపమే యాపలు కట్ల, కానివిధమైన మనుష్యుల కేల గల్గుఁ [గ్రే] చూపుల రాజ్యలక్ష్మి యరిఁ జూచిన[13] చూపుల వీరలక్ష్మియున్.