పుట:వెలుగోటివారి వంశావళి.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

వెలుగోటివారి వంశావళి


శా.

శ్రీమత్కాంతిఁ గృపం బ్రతాపమున వాక్ శ్రీ ధీవిలాసంబునన్[1]
సామర్థ్యంబున భాగ్యసంపదలఁ జంచద్బాహుగర్వంబునన్
సోమున్ రాము రవిన్ గవిన్ మురహరుం సుత్రామునిన్ భీమునిన్
.....................................................................................[2].

243


క.

 మ్రొక్కని రాజులు నీచేఁ
జిక్కని మన్నీలు సేవ సేయని దొరలున్
లెక్కించి చూత మేరీ
దిక్కులలో రాయవిభుని తిమ్మయ తమ్మా.

244


వ.

అల గనితిమ్మభూభుజునకు వేదత్రయ శిఖత్రయ రామత్రయంబు లనందగిన
కుమారులు పెదతిరుమలవిభుండు నాయనేంద్రుండు తిమ్మధీమణియు[3]
గల్గిరి[4]. అం దగ్రజుండు.

245


చ.

విడువక పెద్దతిమ్మపృథివీధవుచేతి[5] పయోధరంపు వి
ల్లడరు గుణస్వనంబు లుఱుమై[6] జడిమై శరవృష్టు లీనినన్
జడిసి నభోధ్వగాము లయి చయ్యన శాత్రవరాజహంసముల్
కడువడి నేగుదెంచె వనికా[7]వనజాకరతీరభూమికిన్.

246


వ.

ఆనల్లగండ్లనాయని[8] సహోదరుండు.

247


సీ.

తగువారిలోఁ జౌకదనము గాంచిన వార్ధి
        యింద్రుచేఁ దూలిన హిమనగంబు
పురహరాలోకనంబునఁ గ్రాఁగిన మరుండు
        పగటికైనను[9] లేని భానుసుతుఁడు

  1. A.B. వాచ్కీధీవిలాసంబునన్
  2. A.B. A line is missing.
  3. A.B. తిమ్మధీమణి
  4. A.B. గల్గె నందగ్రజుండు
  5. A.B. చేత
  6. A లెల్లడరు. . . వరమ్మె; B. వెల్లడరు. . వరమ్మె
  7. A.B. దేరవనికా
  8. According to the prose passage above, the name ought to be Peda Tirumala. Nallaganḍḷa Nāyaḍu is probably an alias of the same chief.
  9. A. 'పగలింటికిని'