పుట:వెలుగోటివారి వంశావళి.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

వెలుగోటివారి వంశావళి


నడుము పేదఱికంబు వడసిన కరివైరి
        వీచివాటైపాఱు వేల్పు టేఱు
చిట్టాడి మడుఁగుఁ జొచ్చిన నాగకేతుండు
        పలలాశిచేఁ బట్టు వడిన వజ్రి
తనదు గాంభీర్యధైర్యసౌందర్యదాన
శౌర్యకీర్త్యభిమాననిస్తంద్రభోగ
ములకుఁ దులయె నా[1] భూమిని బొగడ నెగడె
నాయనేంద్రుండు సౌఖ్యసంధాయకుండు[2].

248


సీ.

పటహభేరీడక్కభాంకృతిధ్వనులచేఁ
        బగతురగుండెలు పగులువాఱు
హయఖురఘట్టనోద్ధతరేణురాగంబు
        గగనభాగం బెల్లఁ గప్పికొనును[3]
బలపరాక్రమవీరభటరాహుతులచేతఁ
        దోరంపుటడవి తుత్తుమురు లగును[4]
కరిఘటాప్రకటసంఘటితఘోషణముచే
        గుంభికుంభీంద్రముల్ గొణఁగు పడును
నీవు రణరంగభూమిలో నిలిచినపుడు
గాయగోవాళ ఖడ్గనారాయణాంక
భాగ్యచారిత్ర తిమ్మభూపాలపుత్ర
నయహరిశ్చంద్ర, వెలుగోటి నాయనేంద్ర.

249


సీ.

నిచ్చకల్యాణంబుఁ బచ్చతోరణమును
        గలిగెఁబో నిర్జరకామినులకు
సర్వకాలంబును[5] సరిలేనిసంక్రాంతి
        బోగియు గలిగెఁబో భూతములకు

  1. A.B. సౌర్యకీర్తియభిమాననిస్తాంద్రభోగములకు దులయన
  2. A.B. సంధాయనుండు
  3. A.B. కొనగ
  4. A.B. తుత్తుమురుగాగ
  5. A.B. సార్వకాలంబును