పుట:వెలుగోటివారి వంశావళి.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

87


లేములు[1] విడిచి చల్దియు వేఁడియును నిండ్ల
        సమకూడెఁ బో మృగజాతి కెల్ల
నవత లన్నియుమాని భువిచారములచేత[2]
        వింతయై యొప్పెఁ బో విహగకులము
ఆహవంపంబున నాగార్జునాద్రిబైటఁ
గొసరి[3] జయలక్ష్మి నిన్నుఁ జే కూడినపుడు
సోమకులరాజవర్గనిర్ధూమధామ
నాయకోపేంద్ర వెలుగోటి నాయనేంద్ర.

250


సీ.

పరశురాముఁడు రాజపటలంబు ననిలోనఁ
        జదిపిన[4]నాఁటి మాంసంబురుచులు
కినిసి రాముఁడు దశగ్రీవాదిదైత్యులఁ
        దనియించు[5]నాఁటి నెత్తురులరుచులు
కవ్వడి గాంగేయఘనయోధముఖ్యుల
        జంపిననాఁటి మజ్జం[6]పురుచులు
వాసవుఁ డుగ్రజంభాసుర[7]ప్రముఖులఁ
        దునిమిననాఁటి మేదోరసంబు[8]
..............................................[9]
నాయకాధీశు వెలుగోటి నాయనేంద్రుఁ
జేరి యనిలోనఁ జిరకాల[10]జీవులైన
భూతములు సొక్కు దశదిశాభూములందు.

251
  1. B. వేములు
  2. A. B. చవిచారముల
  3. A. B. మరియు నాగార్జునాద్రి బైటకడగి
  4. A. రాజ్యపటలంబు. . . బొరిగొన్న
  5. A. B. సమయించు
  6. A. B. మజ్యంపు
  7. A. B. వాసవుడుగ్రాజిభాసుర
  8. A. B. మేదురసంబు
  9. A line is missing
  10. A. B. చరితమాలోన స్థిరకాలజీవులై