పుట:వెలుగోటివారి వంశావళి.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

వెలుగోటివారి వంశావళి


సీ.

పద్మనాయకు లైన బాంధవు లొకవంక
        నుత్తమక్షత్త్రియు లొక్కవంక
దండనాథులు[1] మేటిదళవాయు లొకవంక
        నుభయప్రధానులు నొక్కవంకఁ
గవులు విద్వాంసులు గణితజ్ఞు లొకవంక
        [నుర్వీపతులదూత లొక్కవంక][2]
భటనటగాయకభామిను లొకవంక
        నుచితజ్ఞులగు వైద్యు లొక్కవంక
బ్రభులుఁ బరివారములు మిమ్ము బలసికొలువ[3]
మహిని శోభిల్లు నాస్థానమంటపంబు[4]
విమలచారిత్ర తిమ్మభూవిభుసుపుత్ర
నయహరిశ్చంద్ర వెలుగోటి నాయనేంద్ర.

252


మ.

అరయన్ దిమ్మయనాయనేంద్రుఁడు భుజాయత్తాసిచేఁ గార్యభా
సురపారాభవభాద్రశుద్ధచవితీసోమాఖ్యవారాన డ[5]
గ్గరి నాగార్జుని కొండయొద్ద రిఫులన్ ఖండించే నాఖండలే
శ్వరనాగేశ్వరలింగభూవినుతకృష్ణావాహినుల్ సాక్షిగన్.

253


చ.

అలవునఁ దాళజంఘులను హైహయులన్ ద్రుపదేంద్రుపుత్రునిన్[6]
దొలి సగరుండు భార్గవుడు ద్రోణతనూజుఁడు ద్రుంచినట్లు వి
హ్వలముగ సోమవంశజుని యావడియోబళరాజు నాజిలో
నలిగి[7] వధించెఁ దండ్రిపగకై భళి మావేలుగోటి నాయఁడున్.

254


క.

ఆవడి యోబ[8]నృపాలుని
నావడి నేనాయనయ్య యసిధారఁ దెగం

  1. A.B. దండనాయక
  2. The Mss. repeat here the second part of the previous line
  3. This line is not found in B
  4. A.B. నీయాస్థానమంటపమున
  5. A.B. కార్యభాసురుం డైపరాభవ సంవత్సర భాద్రపదాదిశుద్ధచవితిన్ సోమవారమందాజిద;
    ′సురసారాభవభాద్రశుద్ధచతుర్థీసోమాఖ్యవారంబునన్ | ధర′ అనియు సవరించవచ్చును. ఇంద ′ర్థీ' తేల్చిపలుకవలయును.
  6. A.B. పుత్రుఁడున్
  7. A.B. తొడరి
  8. A.B. వోటు