పుట:వెలుగోటివారి వంశావళి.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

వెలుగోటివారి వంశావళి


మ.

ఘనతన్ బర్వతకందరస్థలమునన్[1] గాల్నిల్పి[2] పైకొన్నచోఁ
గినుకన్ గన్నడరాయఘోటమృగపంక్తిన్ గూల్చె నుద్వృత్తిమైఁ
జెనకెన్ మత్తమతంగజప్రభు నదల్చెన్ రామఱే నేపునన్[3]
గనితిమ్మక్షితిపాలసింహుఁ బొగడంగాఁ బోలదే[4] యేరికిన్.

240


సీ.

కల్పవృక్షంబులు గణుతింపఁ బడెఁ జెట్ల[5]
        వడిఁ గామధేనువు వట్టిపోవు[6]
తుది నప్పువడి గాలి[7] దూలె నామేఘుండు
        రమణఁ జింతామణి రాతిగుండు[8]
పాతాళగతుఁ డయ్యె బలిచక్రవర్తి దా
        భావింపఁ జంద్రుఁడు పక్షపాతి
యర్కనందనుఁడు దా నరయ దరిద్రుండు[9]
        శిబిమేని మాంసంబు చెప్ప రోఁత
యిట్టి దాతలవితరణ లేల చెప్ప[10]
నిన్నుఁ గొనియాడఁ దగుఁ గాని నేర్పుతోడ
నర్థి దారిద్ర్యతిమిర దోషాపహరణ
దినకరాటోప[11] వెలుగోటి తిమ్మభూప.

241


ఉ.

గోపతితుల్యభోగ వెలుగోటిపురీంద్రకుమారతిమ్మ [నీ]
రూపము విక్రమాంకు[12] నిజరూపముగాక మనుష్యరూపమే
యాపలు కట్ల, కానివిధమైన మనుష్యుల కేల గల్గుఁ [గ్రే]
చూపుల రాజ్యలక్ష్మి యరిఁ జూచిన[13] చూపుల వీరలక్ష్మియున్.

242
  1. A. కంధరస్థలనన్; B. కంధరస్థలిని
  2. A.B. గాల్నిల్చి
  3. A.B. చామరేయేపునన్
  4. A.B. పాగండబోలఁడే
  5. A.B. బడిశట్లు
  6. A.B. ఒగికామధేనువు వొర్యగురుపా
  7. A.B. గాని
  8. A.B. గుండె
  9. A.B. ద్యార్న దారిద్రుడు
  10. A.B. వితరణుడేమి చెప్ప
  11. A.B. ధీరతాటోప
  12. A.B. విక్రమార్కు
  13. A.B. వీరలక్ష్మి నలిగిచూచిన