పుట:వెలుగోటివారి వంశావళి.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

83


యొరసిన రౌద్రంబు హెూమకుండము సేసి
        తఱచైన నరములు దర్భ చేసి
విమతుల దంతముల్ వెల్లక్షతలు[1] చేసి
        క్రొవ్వును గఱగించి ఘృతము చేసి[2]
సొబగుతో వేల్చు నీఖడ్గసోమయాజి
యహహ! రేచర్లసింహాసనాధినాథ
గాయగోవాళ బల్లరగండబిరుద
రాయభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

238


సీ.

నీవు పుట్టిన వేళ [నీ*] శత్రువరులకు[3]
        దిగు లెత్తి [మఱు] పుట్టు[4] దినము వచ్చె
నీ వొకించుక[5] నగ నేర్చినఁ బగవారి
        బ్రదుకు లెల్లను నగుఁబాటు లాయెఁ
గ్రమముగ నీవు విద్దెము సేయ నేర్చిన[6]
        విద్దెల[7]వా రైరి విమతవరులు
ప్రభుశిఖామణి నీవు పరువాఱ నేర్చిన
        బరువు లెత్తిరి పరిపంథు లెల్ల
హయము నీ వెక్క నేర్చిన నహితవరులు[8]
కొండ లెక్కిరి తమయిండ్ల నుండ వెఱచి
రూఢి నీ వాదిగర్భేశ్వరుఁడవుగాన
రాయభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

239
  1. A.B. వెల్మక్షతలు
  2. A.B. 'క్రొవ్వుగరగించటు ఘ్రుతముచేసి.' 'క్రొవ్వు' 'ఘృతము' అనుచోట 'ఘృ'ను 'ఘ్రు' గా కవి భ్రమచే గ్రహించి 'క్రొ' 'ఘృ' లకు యతిమైత్రి గల్గించెను. ఇట్టి ప్రయోగములు 'నవనాథచరిత్రము', 'భాస్కరరామాయణము' మొదలగు గ్రంథములయందు గానవచ్చుచున్నవి.
  3. B. శత్రువీరులు
  4. A.B. పుట్టిన
  5. A.B. నీవువకించుక
  6. A.B. క్రమమీద నీవు విద్యము శాయనేర్చిన
  7. A.B. విద్యల
  8. A.B. నీవు హయ మెక్క నేర్చిన యహితవరులు