పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమముగా తన స్వాధీనమునకు వచ్చినప్పుడు నకిలీదని అందజేయువానికి తెలియక నాణెమును, అసలైన నాణెముగా అందజేయుట.

241. నకిలీ నాణెమని తాసు ఎరిగియున్నట్టి దైనను ఆది తన స్వాధీనమునకు వచ్చినప్పుడు నకిలీదని తాను ఎరగనట్టి నకిలీ నాణేమును దేనినై నను ఏ ఇతర వ్యక్తి నైనను అసలైన నాణెముగా పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, నకిలీ నాణేపు విలువకు పదిరెట్ల దాక ఉండగల మొత్తమునకు జార్మానాతో గాని, ఈ రెండింటితొగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

నకిలీ నాణెములను చేయు 'ఏ ' అనునతడు తన సహాపరాధియైన 'బీ' కి కంపెనీ వారి రూపాయలను పోలిన నకిలీ రూపాయలను చెలామణి చేయునిమిత్తము అందజేయును. 'బీ' ఆ రూపాయలను నకిలీ నాణెములను చెలామణిజేయు మరొకవ్యక్తి యైన 'సీ' కి విక్రయించును. అవి నకిలీ వని ఎరిగియుండియు ఆతడు వాటిని కొనును.ఆ రూపాయలను 'సీ' అవి నకిలీవని తెలియనట్టి 'డీ'కి సరుకులకై చెల్లించును. 'డీ' ఆ రూపాయలను పుచ్చుకొనిన పిమ్మట అవి నకిలీవని కనుగొని అవి మంచి రూపాయలైనట్లే వాటిని ఇతరత్రా చెల్లించును . ఇచట ' బీ 'మరియు ' సీ', 239వ లేక సందర్భానుసారముగ, 240వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగియుందురు. కాని ' డీ 'ఈ పరిచ్ఛేదము క్రింద మాత్రమే శిక్షింపబడును.

తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణెమని ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనమందుంచుకొనుట.

242. . తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణెమని తాను ఎరిగి యుండియు, కపటముతో గాని కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశములో గాని, అట్టి నాణెమును స్వాధీనము నందుంచుకొనిన వారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

తన స్వాధీనమునకు చ్చినప్పుడే భారతీయనాణెమునకు నకిలీదగు నా ణెమని ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనమందుంచుకొనుట.

243. తన స్వాధీ నమునకు వచ్చినప్పుడే భారతీయ నాణెమునకు నకిలీదగు నాణెమని ఎరిగియుండి, కపటముతోగాని, కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశముతో గాని, అట్టి నాణెమును స్వాధీనమందుంచుకొనువారెవరై నను,ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

టంకసాలలోని ఉద్యోగి శాసన నియతమైన తూకమునకు లేక మిశ్రమమునకు భిన్నమైన నాణెమును తయారు చేయుట.

244. శాసనసమ్మతముగా భారత దేశములో స్థాపింపబడిన ఏదైనా టంకసాలలో ఉద్యోగియై యుండి ఆ టంకసాలనుండి విడుదల చేయబడు ఏదేని నాణెమును శాసన నియతమైన తూకమునకు, మిశ్రమమునకు, భిన్నమైన తూకముతో, లేక మిశ్రమముతో చేయు ఉద్దేశముతో ఏదేని కార్యమును చేయు లేక చేయుటకు శాసనరీత్యా బద్దుడై యున్న కార్యము చేయకుండు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నాణెములను తయారుచేయు ఉపకరణమును శాసన విరుద్ధముగా టంకసాలనుండి తీసికొని పోవుట.

245. శాసన సమ్మతముగా భారతదేశములో స్థాపింపబడిన ఏదైనా టంకసాలనుండి, నాణెములను చేయు ఏదైనా పనిముట్టును, లేక ఉపకరణమును శాసన సమ్మత ప్రాధికారము లేకుండ తీసికొనిపోపు వారెవరైనను ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కపటముతోనైనను, నిజాయితి లేకుండా అయినను నాణేపు తూకమును తగ్గించుట లేక మిశ్రమమును మార్చుట.

246. ఏదైనా నాణెము పై , దాని తూకమును తగ్గించునట్లు, లేక ఆందలి మిశ్రమముము మార్చునట్లు దేనినైనను కపటముతో గాని, నిజాయితీ లేకుండ గాని చేయువారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింప బడుదురు మరియు జార్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :— నాణెమును తొలిచి ఏర్పడిన ఖాళీలో ఏదైన ఇతర వస్తువును నింపునట్టి వ్యక్తి నాణెపు మిశ్రమమును మార్చిన వాడగును.

కపటము తోనైనను నిజాయితీ లేకుండా అయినను, భారతీయ నాణెపు తూకమును తగ్గించుట, లేక అందలి మిశ్రమమును మార్చుట.

247. ఏదైనా భారతీయ నాణెము పై దాని తూకమును తగ్గించునట్లు లేక, ఆందలి మిశ్రమమును మార్చునట్లు దేనినైనను కపటముతో గాని, నిజాయితీ లేకుండ గాని చేయు వారెవరైనము, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు,