పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 07-3 సాళంగనాట సం: 10-038

పల్లవి:

తగవో బలిమో నీతలఁపై నాతోఁ జెప్పర
నగువమోముతోఁ గదిరినాథ నీవు

చ. 1:

యేరా వొద్దన్న మాన విల్లురికి నాతోను
మీరి నవ్వేవు కోమటిమేనరికమా
వారము వజ్జ మనక వాకిట నన్ను నాఁగేవు
పోరచి మావారు నీకుఁ బోఁక వెట్టిరా

చ. 2:

కొంత గొంత కోపించిన కొంగువట్టి నాతోను
రంతులు సేసేవు నీకు రాచబలిమా
వంతుకు వాసికి నన్ను వావిదేరఁ బిలిచేవు
కొంతైనా మావారు నీవుంకువ వట్టిరా

చ. 3:

గబ్బినై యదలించిన కన్నుల మొక్కుచునన్ను
గొబ్బునఁ గాఁగిలించేవు గొల్లదోమటా
అబ్బురపు శ్రీవెంకటాద్రినాథ కూడితివి
సిబ్బితివాయఁ బెండ్లి సేసిరా నీకూ