పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0010-05 దేవగాంధారి సం: 10-059

పల్లవి:

నిమిష మెడతెగక హరి నిన్ను దలచి
మమత నీమీఁదనే మరిపి బదుకుట గాక

చ. 1:

నిదురచేఁ గొన్నాళ్లు నేరములఁ గొన్నాళ్లు
ముదిమిచేఁ గొన్నాళ్లు మోసపోయి
కదిసి కోరినను గతకాలంబు వచ్చునె
మది మదినె వుండి యేమరక బదుకుట గాక

చ. 2:

కడుఁ దనయులకు గొంత కాంతలకు నొకకొంత
వెడలయాసలకుఁ గొంత వెట్టిసేసి
అడరి కావలె ననిన నందు సుఖ మున్నదా
చెడక నీసేవలే సేసి బదుకుట గాక

చ. 3:

ధనమువెంటాఁ దగిలి ధాన్యంబునకు దగిలి
తనవారిఁ దగిలి కాతరుఁ డైనను
కనుకలిగి శ్రీవెంకటనాథ కాతువె
కొనసాగి నిన్నునే కొలిచి బదుకుట గాక