Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0010-06 వరాళి సం: 10-060

పల్లవి:

గాడిదెపిల్ల కోమలికమె కలిగినది
వేడుక పడు సంసారమె విసిగించు వెనక

చ. 1:

అగపడు సంపదమీదట నాసలు కడుఁ బుట్టు
వగ నది భరియింప వసమె కాదయ్య
మొగమె చూడఁగ నాపై ముదమునఁ గనుపట్టు
పొగులఁగ గరచెటికాట్లు పులికంటె బెట్టు

చ. 2:

విడువని భోగంబులపై వేడుక కడుఁ బుట్టు
తడఁబడులంపట మైతే తలఁచనె రాదయ్య
తొడి మెను మాగినపండైతే తోఁచుఁ జూచినను
వడియఁబడి గొడ్డంటికి వసమె కాదెవుడు

చ. 3:

మోవఁగ విషయంబులపై మోహము కడుఁ బుట్టు
శ్రీవెంకటనాథా అది చెప్పఁగ రాదయ్య
ఆవలఁజూడఁగఁ జల్లనై వుండుఁ గాని
తేవలఁ గూఁకటవేళ్లు తెగఁ బారును మిగులా