ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0010-04 లలిత సం: 10-058
పల్లవి:
సకలపురాణములు చాటి నినుఁ బొగడఁగా
తకమకలుగా నల్పార్థము చెప్పఁదగునా
చ. 1:
నిను నిర్గుణు డనేటి నీచజాతులయందు
యెనయు దుర్గుణము దా నెంతో
కనకంబు నిను మనుచు కారునాయంబులను
యెనలేనిదుర్వాదుల నేమనఁగఁగలము
చ. 2:
నీవె తా మనుకొనేటి నిందితాత్ములు దాము
కావించుద్రోహంబు కడమా
దావతులఁ దనుఁగన్నతల్లి గొడ్డనిపల్కు
దేవతానిందకులఁ దెలుపంగ వశమా
చ. 3:
అమరుసర్గము మిథ్య యనుశూన్యభాషులకు
తమితోడ భ్రమ యేల తరగు
తమగురువు శాస్త్రంబు తామె కల్లనఁ గాను
క్రమబుద్ధి శ్రీవెంకటనాథ యిత్తువా