Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0010-03 భూపాళం సం: 10-057

పల్లవి:

గోవిందా మేల్కొనవయ్యా
కావించి భోగము కడమా నీకు

చ. 1:

కమలజ చల్లనికాఁగిటఁ దగిలి
సమరతి బాయఁగఁ జాలవూ
కమలభవాదులు కడు నుతియింపఁగ
విమలపుశయనము విడువగ లేవు

చ. 2:

భూసతితోడుత పొందులు మరిగి
వేసర విదె నీవేడుకలా
వాసవముఖ్యులు వాకిట నుండఁగ
పాసి వుండ నని పవళించేవూ

చ. 3:

నీళామనసిజలీలలఁ దగిలి
నాలితోడ మానఁగ లేవూ
వేళాయను శ్రీవెంకటనాథుఁడ
పాలించి దాసుల బ్రతికించఁగనూ