ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0010-02 నాట సం: 10-056
పల్లవి:
ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా
బందెపసులకు మెడ పన్నించ నేలా
చ. 1:
యినుమునఁ జేసిరా యెవ్వరిదేహమైనా
పొనిఁగి పోతేఁబోవు పోకుంటే మాను
పనివడి యిందుకుఁగా బాటువడ నేమిటికి
మొనసి దొసపంటికి యినుప కట్టేలా
చ. 2:
మంచి రాతఁ జేసిరా మనుజునిమే నేమి
నించి చెడితేఁ జెడు నిల్చితే నిల్చు
పొంచి పొంచి యిందుకుఁగా పొడిఁబడ నేఁటికి
పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా
చ. 3:
చేఁగమానఁ జేసిరా చెల్లఁబో నరుల నెల్లా
యీఁగి కుంగితేఁగుంగు హెచ్చితే హెచ్చు
నాఁగువార శ్రీవెంకటనాథుఁడు మన్నించఁగాను
దాఁగి జీలుగుబెండుకు తరమువెట్ట నేలా