Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0010-01 దేసాళం సం: 10-055

పల్లవి:

ఎఱుక గలిగితేను యీతఁడె దిక్కు
మఱి నిమిష మీతని మానివుండఁదగునా

చ. 1:

యెవ్వరిసొమ్ముగుడిచి యెవ్వరిగుఱ్ఱాలవెంట
కొవ్వుదీరఁ బారాడి కొలిచేది
యివ్వలఁ బుట్టించి పెంచి యేలిన దేవుఁ డుండఁగా
ఆవ్వ లివ్వలివారిని ఆసపడఁ దగునా

చ. 2:

తా నెవ్వరికి బుట్టి తలఁకక వూరివారి
నానందాన అయ్య లమ్మ లనుకొనేది
పానిపట్టి సర్వవిధబంధుఁడు విష్ణఁడుండఁగా
మానిసిచుట్టరికాలు మరుగగ జెల్లునా

చ. 3:

యెందువంకనో యీదేహి యేమిటినో పొగడుచు
విందువలె నెవ్వరిని వెఱ్ఱిఁజేసేది
కందువైన శ్రీవెంకటనాథుఁడు గావఁగా
సందుసుడి కోరికల సటఁ బడఁ జెల్లునా