పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 15-4 హిందోళం సం: 10-087

పల్లవి:

పాలు దాగె వెన్న దినె బానల పెరుగు జుఱ్ఱె
సోలి కాఁగులనేతులు చూరలాడె నమ్మా

చ. 1:

చిన్నవాని ఆరడి సేసినట్లు వుండుఁ గాని
యెన్నెన్నిపోకిళ్లఁ బోయ్యీ యీకృష్ణుఁడు
కన్నెలు ముద్దాడఁ బోతే గంటి సేసి మోవు లెల్ల
తన్నుఁ గానట్టున్నాఁడు దయ్యపువాడమ్మా

చ. 2:

తగినపసిబిడ్డనిఁ దతిగొన్న ట్టుండుఁ గాని
యెగసక్కే లెన్ని నేర్చె యీగోవిందుడు
మగువ లెత్తుకొంటేను మరి గోళ్లువెట్టి తానె
తగవులు చెప్పెఁ గతలకారోయమ్మా

చ. 3:

పలుదూరులు బాలునిపైఁ జెప్పినట్టుండుఁ గాని
కలికివాఁడమ్మ శ్రీవెంకటనాథుఁడు
చెలులు కాఁగిలించితే సిగ్గు వీడఁ గూడి కూడి
వలపించినాడు యెటువంటివా డోయమ్మా