ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 15-5 పాడి సం: 10-088
పల్లవి:
అంతేపో నాతోడ నౌఁ గా దనఁ గ రాదు
పంతమాడి గెలిచితే బంట వయ్యేవా
చ. 1:
కానీ లేరా పొడుపుడుఁగతలు వొడువు మని
ఆనవెట్టి న న్నేల అడ్డగించేవు
పూని నా కతలు నీకుఁ బొందుగాఁదెలియకుంటే
పానిపట్టి నీవె నా బంట వయ్యేవా
చ. 2:
చలపటి నాతోడ సరిబేసు లాడు మని
బలిమి నాకొం గేల పట్టి తీసేవు
వొలిసి ని న్నిప్పుడె వొడించితే నాతోడఁ
బలుమాఁట లేల నాబంట వయ్యేవా
చ. 3:
నీవు దలఁచిన సుద్ది నిక్కి నన్నుఁ జెప్పుమని
కావించి మండెమురాయ కాఁగిలించేవు
శ్రీవెంకటనాథుఁడవె చెలఁగి నీ వనుచు నీ
భావ మెరిఁగి కూడితి బంట వయ్యేవా.