Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం .రేకు: 15-6 ముఖారి సం: 10-089

పల్లవి:

ఇది యేమె వీనిగుణ మొటువంటిదే
వదలక నవ్వ నూరవదినెనా నేను

చ. 1:

చక్కనివాఁ డైతేఁ దానె చల్లఁగా నుండుఁ గాక
యిక్కడ నెవ్వరి భ్రమయించ వచ్చీనె
వక్కణలమాఁటలకు వలచి వెంటఁ ది రుగ
తక్కరి రేపల్లె గొల్లదాననా యేమి

చ. 2:

పాయపువాఁ డైతేను బదుక నీవె యిట్టె
కాయక మై యెవ్వరిపైఁ గన్ను లార్చీనె
సోయగ మై తనమోము చూచి నట్టె మోహించి
పాయకుండ మేనవారిపడుచనా నేను

చ. 3:

నేరుపది దా నైతె నెమ్మది నుండుఁ గాక
కేరి కేరి యెవ్వరిపై గేలు చాఁచీనె
చేర వచ్చి నెల్లూరి శ్రీవెంకటనాథుఁ డిట్టె
యీరీతినె ననుఁ గడె యిందిరనా నేను.