పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0002-04 మలహరి సం: 10-009

పల్లవి:

హిత విదె తెలుసుకొమ్మీ
సతతముఁ జాటితిని

చ. 1:

సేయవోయిజిహ్వ యీశ్రీహరి నుతియెపుడూ
రోయవోయి నీవు యీరుచుల యందలి వేడుకా

చ. 2:

కోరవోయి మనసా యిఁక గోవిందుని చింతా
చేరకువోయి నీవు యీ చెడుగుఁ గామాదులను

చ. 3:

విడువకువోయి దేహి శ్రీవెంకటగిరినాథుని
వుడుగవోయి నీవు యీవులుకుఁ దొల్లిటిచేఁతలు