ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0002-04 మలహరి సం: 10-009
పల్లవి:
హిత విదె తెలుసుకొమ్మీ
సతతముఁ జాటితిని
చ. 1:
సేయవోయిజిహ్వ యీశ్రీహరి నుతియెపుడూ
రోయవోయి నీవు యీరుచుల యందలి వేడుకా
చ. 2:
కోరవోయి మనసా యిఁక గోవిందుని చింతా
చేరకువోయి నీవు యీ చెడుగుఁ గామాదులను
చ. 3:
విడువకువోయి దేహి శ్రీవెంకటగిరినాథుని
వుడుగవోయి నీవు యీవులుకుఁ దొల్లిటిచేఁతలు