ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0002-03 దేవగాంధారి సం: 10-008
పల్లవి:
ఎవ్వరుచెప్పినా మనసేల మానును
యివ్వలవ్వలౌఁగాక యేలమానును
చ. 1:
కమ్ముకొన్న యింద్రియాలు గారడించఁగా జీవుఁ
డెమ్మెలఁ బొరలక మరేల మానును
యిమ్ములేనికోరికలు యెక్కెక్కు లాడఁగాను
వుమ్మడికర్మాలుసేయ కూర కేల మానును
చ. 2:
పేరడిమదములెల్లా పెనగొనఁగా నొరుల
నీరసించ కీ దేహి యేలమానును
తీరనిచలము లివి తెలివి చెరుచఁగాను
యేరవెట్టుకొనియుండ కేలమానును
చ. 3:
వుడివోనియాసలు వొత్తుకోలుసేయఁగాను
యిడియక యీప్రాణుఁ డేలమానును
కడువేగ శ్రీవెంకటనాథుఁడు గావఁగా
నెడయక కని మన కేలమానును