Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0002-05 గుజ్జరి సం: 10-010

పల్లవి:

ఎంతలే దిది యెంచిన
సంతోషించని సంసారంబు

చ. 1:

యేలకొ నేఁ డీదేహి
ఆలరి భోగము లడిగీఁగాక
చాలించఁగఁ జాలఁడు
కోలుముందు హరిఁ గోలువఁగరాదా

చ. 2:

యెందైనను యీమనసు
పందదనంబునఁ బారీఁగాక
ముందరికోరిక ముణుఁగదు
కందువ శ్రీవిభుఁ గానఁగరాదా

చ. 3:

విడువనితగు లీవేడుక
తొడిఁబడ నెందైన దొరసీఁగాక
కడగని శ్రీవెంకటనాథు
బడిబడిఁ దిరుగుచు బ్రదుకఁగరాదా