Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0002-06 బౌళి సం: 10-011

పల్లవి:

బ్రహ్మఁగన్న వాఁడు పసిబిడ్డ
బ్రహ్మమైనవాఁడు పసిబిడ్డ

చ. 1:

వగపులేక చంపవచ్చిన బూతకి
పగసాధించినవాఁడు పసిబిడ్డ
పగటునఁ దనమీఁదఁ బారవచ్చినబండి
పగులఁ దన్నినవాఁడు పసిబిడ్డా

చ. 2:

గుట్టున నావులకొరకు వేలనె కొండ
పట్టి యెత్తినవాఁడు పసిబిడ్డా
జెట్టిపోరునఁ దన్ను జెనకవచ్చినవానిఁ
బట్టి చంపినవాఁడు పసిబిడ్డా

చ. 3:

మిడికెటికోపపు మేనమామఁ బట్టి
పడనడిచినవాఁడు పసిబిడ్డా
కడువేగ శ్రీవెంకటనాథుఁవై గొల్ల
పడఁతులఁ గూడినాఁడు పసిబిడ్డా