Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0002-07 లలిత సం: 10-012

పల్లవి:

చెప్పే నామాట విను చిత్తమా
చిప్పిలు నెండమావుల చెరువులు నున్నావా

చ. 1:

వెగటైనవిషయాల వేడుకపడకు మవి
జిగురుఁగండెలు సుమ్మీ చిత్తమా
పొగరుమూఁపుఁదనాలఁ బొరలకు మవియెల్ల
తగులు విరిపందెల దారివంటివి

చ. 2:

బలిమినె యాసలబారిఁ బడకు మవి
చిలుకల వోఁదా లోచిత్తమా
తలఁచిచూచితేనె తప్పులుఁ దారులె
కలలోని రతులయాఁకట వంటివి

చ. 3:

మేరమీరెకోరికల మిసిమి చూడకు మవి
జీరుకుబండ లోయిచిత్తమా
చేరువనె కాచెటి శ్రీవెంకటనాథుఁగని
గారవాన బ్రదుకుమీ కల్పవృక్ష మతఁడు