ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0003-01 లలిత సం: 10-013
పల్లవి:
పచ్చిగాఁ దెలియకుంటె బహుముఖమై తోఁచు
అచ్చమై యిన్నియును శ్రీహరి కల్పితములే
చ. 1:
కొందరు దిట్టుదురూ కొందరు దీవింతురు
చందపుసంసారము జాడలివి
కందువ రేయీఁ బగలుఁ గాలము నడచినట్టె
అందరిలో గలుగు శ్రీహరికల్పితములే
చ. 2:
కొన్నిట్టిపైకోపము కొన్నిటి పైవేడుక
వున్నతి దేహధారుల వోజ లివి
పన్ని కాయ పండు దొండపంటియందె తోఁచినట్టు
అన్నియుఁ బుట్టించిన శ్రీహరికల్పితములే
చ. 3:
కొంతచోట మనుజులు కొంతచోట దేవతలు
అంతా శ్రీవెంకటనాథు నాజ్ఞ యిది
చెంత చప్పనయుఁ దీపు చెఱకందె వుండినట్టు
కాంతుఁడైన శ్రీహరికల్పితములే