పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0247-2 మధ్యమావతి సంపుటం: 08-278

పల్లవి:

దానికేమి యిప్పుడేమి తప్పిపోయీనా
వూని యెదురుకట్లనె వున్నాఁడుగా

చ. 1:

అలసిన రతివేళ ఆడినట్టి యీమాటలు
తలఁచుకొమ్మనమో తనుఁ దానె
పిలిపించి నాతోఁ దాను పెనఁగిన పెనఁగులు
తెలిపే లేవె యింకా తెరమరఁగుననె

చ. 2:

చిడుముడి మంచముపై చెనకిన చెనకులు
తడవి చూచుకొమ్మనవె తన మేననె
వుడివోక తారుమారై వునిచిన వుంగరాలు
తడఁబడీ వేళ్లను తానెరఁగఁడా

చ. 3:

కొత్తగా నాకాఁగిటిలో కూడినట్టి కూటములు
యెత్తి యిమ్మనవె యీవేళనె
హత్తెను శ్రీ వెంకటేశుఁ డట్టె తానన్ను
తత్తరపు దమకము తనివి నొందీనా