పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0247-3 శ్రీరాగం సంపుటం: 08-279

పల్లవి:

చిన్నఁబోయివుందాననా చేరి నీతో నలిగేనా
సన్నల నిన్నుఁ జింతించే జాడ లింతేకాక

చ. 1:

నెక్కొన్న వేడుకలకు నీవు గలవు మాకు
చెక్కు చేతితోడుతను చింత మాకేల
వక్కణతోఁ గన్నుఁ గలువలు గలమోముతోడ
గుక్కక తామెర చేయిఁ గూర్చితిఁగాక

చ. 2:

దట్టమై నామతిలోన తగు నీరూపెడయదు
వట్టి విరహాన వసివాడనేల
పట్టి తనువల్లిగాన పన్నీరు గంద మందుకు
పెట్టి పొరలించె మెత్తి పెద్దసేసేఁగాక

చ. 3:

కాఁగిట నీవుగలవు కమ్మఁజెమటల రతి
నాఁగి యాఁగి సారె సారె నలయనేలా
కాఁగిటఁ గూడితి శ్రీవెంకటేశ నీ యలపార్చ
వేఁగక నిట్టూరుపుల విసరేఁగాక