పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0237-4 శ్రీరాగం సంపుటం: 08-220

పల్లవి:

ఊడిగాలు సేసుకొంటా నుండనీవయ్యా
దాడివెట్టినిన్నుఁ బట్టేదాన నీకుఁబ్రియమా

చ. 1:

చెప్పినట్టె యెపనైనాఁ జేయఁగాఁ గొంగు వట్టేవు
వుప్పటీంచె యీపనైతే నోపఁగలనా
ముప్పిరిగొన్నసతులు ముయ్యీడువారున్నారు
తప్పులు నిన్నుఁ బట్టేటి దానను నేఁబ్రియమా

చ. 2:

లోనైనీకు నుండఁగాను లోనింటికిఁ బిలిచేవు
కోనల నిందుకు నియ్యకొనఁగలనా
రానిపోని మూలలను రాణివాసాలున్నవారు
తానకమై మారుకొనేదాన నీకుఁబ్రియమా

చ. 3:

గందము నీకుఁ బూయఁగాఁ గాఁగిలించి కూడితివి
అందుకొని యింత అలయఁగఁ గలనా
యిందుకే శ్రీ వెంకటేశ యిదే గోపికలున్నారు
దందువంటి రాజపుదాన నీకుఁ బ్రియమా