పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0237-3 రామక్రియ సంపుటం: 08-219

పల్లవి:

ఏఁటికి విచారమిఁక నాకు
కూటములే నను గురిసేసీని

చ. 1:

యేపున నేనేమి నెఱఁగకుండినా
నీపయి తలఁపులు నేర్పీని
మాపుదాఁక మైమఱచివుండినా
దాపగు వలపులు తలపించీని

చ. 2:

అసురుసురయి నేనటు కనుచొక్కిన
కొసరి కలలు మేల్కొలిపీని
ముసరుసిగ్గులె మోనాననుండిన
పస నీపదములె పాడించీని

చ. 3:

అలమితి రతి నేనలసినాను నీ
తెలిమోవి దప్పిదేర్చీని
యెలిమిని శ్రీవెంకటేశ నాకడమ
గలిగినా నీదయగాచీ నన్నును