పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0236-4 రీతిగౌళ సంపుటం: 08-214

పల్లవి:

కతలు పూవకపూచె కావకకాచె
రతుల మెప్పించేఁగాని రారాదా లోనికి

చ. 1:

చింతలేదు వింతలేదు చెక్కుచేతితో నేను
పొంత నీరూప తలపోసేనదే
మంతనాన నీవేల మాటలనే తనిసేవు
రంతులుసేయక యింక రారాదా లోనికి

చ. 2:

వాడాలేదు పీడాలేదు వచ్చేవంటా నీరాకకు
తోడనే యెదురుచూచే తొలఁగకిదే
యేడగా నాకు నిట్టె యిచ్చకాలాడేవు నీ
రాడువచ్చి ముంతచొచ్చె రారాదా లోనికి

చ. 3:

యీసులేదు రేసులేదు యిపుడునీవుగూడఁగా
ఆసల నలపుదేరే నన్నిటానిదే
సేసవెట్టేదెందాఁకా శ్రీ వెంకటేశ నీవు
రాసికెక్కితివిన్నిటా రారాదా లోనికి