పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0236-3 లలిత సంపుటం: 08-213

పల్లవి:

ఏలపంతాలాడేవు యింతితోను
ఱాలు గరగించే నిన్ను ఱట్టుసేయవచ్చునా

చ. 1:

మాటల దూరఁగలేక మగువ గోర నొత్తితే
నాఁటెనంటా నీవేల సన్నలఁ దిట్టేవు
చాటిచెప్పె నింతేకాక సాదుఁగొయ్యతనమున
జూటుఁ దనమున నిన్నుసూడువట్టవచ్చెనా

చ. 2:

బొమ్మల జంకించలేక పువ్వుల వేసితేను
తమ్మిమోము దాఁకెనంటాఁ దట్టేవు రొమ్ము
చిమ్మి నవ్వితేనె మాయసిగ్గుతోడి చిత్తమున
అమ్మరో నీతోడి చయ్యాటలకువచ్చెనా

చ. 3:

వేసరింపించఁగలేక వెసనిన్నుఁగూడితేను
సేసకొప్పు జారెనంటాఁ జెలరేఁగేవు
ఆసల శ్రీ వెంకటేశ ఆపె నీవు నొక్కటే
బాసలు నీవిచ్చినవి విచారించవచ్చెనా