పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0228-2 దేసాళం సంపుటం: 08-164

పల్లవి:

నీకు బాఁతే చెలులము నీగుణ మిట్టిది గాక
యీకొలఁది నీభావాలేమని నుతింతును

చ. 1:

చెప్పినట్టే చేసేవు చేరి నేనెంత నీ వెంత
అప్పసము నీ వలుపేమని నుతింతు
చిప్పిలఁ గొంగు వట్టితే చేతికి లోనై వచ్చేవు
యెప్పుడూ నీ కృపారసమేమని నుతింతును

చ. 2:

అడినట్టే ఆడేవు ఆతుమ నన్నుఁ జేసుక
ఆడిన నీ సౌలభుఁమేమని నుతింతు
వీడెము చేతికిచ్చితే వేడుక నందుకొనేవు
యీడ నీ మంచితనము యేమని నుతింతును

చ. 3:

కోరినట్టెల్లాఁ గూడేవు కొసరుకు గొసరెల్లా మాని
ఆరీతిఁ జుట్టరికమేమని నుతింతు
సారపు శ్రీవెంకటేశ చనవిచ్చి కలసితి
యేరా నీ రతికేలి నేమని నుతింతును