పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0228-3 భైరవి సంపుటం: 08-165

పల్లవి:

కానవచ్చీ నన్నియును గలసుద్దులపుడు
నీ నేరుపులేర్పడీ లోనికి నేఁగరాదా

చ. 1:

చలము నీతోనేల సారె సారెనాపెకు
పలుకు బెంబడినే పచ్చిసేసీని
అలవోకమాటలా పెనాడితివి దానికేమి
నెలవుల రతికి లోనికి నేఁగరావా

చ. 2:

కోపగించ నీతోనేల కొసరుచునాపెకు
తీపుల బెంబడినే దిమ్మురేఁచీని
చూపులనే రాజము చూపితివందుకేమి
నీపనులు దెలిసి లోనికి నేఁగరాదా

చ. 3:

విచ్చిచెప్ప నీతోనేల వేరేవేరే యాపెకు
మెచ్చుల కాఁగిటిలోనే మెప్పించీని
కొచ్చి శ్రీ వేంకటేశుఁడ కూడితివి అందుకేమి
నిచ్చఁబెండ్లాయను లోనికి నేఁగరాదా