పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0226-4 సౌరాష్ట్రం సంపుటం: 08-154

పల్లవి:

ఏఁటిదో నీచిత్తము నేమెఱఁగమయ్య
వాఁటమైన వెల్లవిరివారమయ్యా

చ. 1:

సిగ్గుపడితిమింతతో సెలవి నీవు నవ్వఁగా
యెగ్గొ తప్పొ యేమంటినో యెరఁగమయ్య
దగ్గరి సేవ సేసితి తగినదొరవు నీవు
నిగ్గులఁ గుచ్చితములు నేరమయ్య

చ. 2:

మోరగందితినింతలో వేఁడుకొనే నిన్నుఁజూచి
మొరఁగులిందేమున్నవో మొక్కేమయ్య
మరినీకు లోనయితి మంచిదేవరవు నీవు
మెరసి నీతోఁ బెనఁగ మేము నేరమయ్య

చ. 3:

చెమరించితివి నీవు చేరి నన్నుఁ గూడఁగాను
తమకమా తడఁబాటో తలఁచమయ్య
అమర శ్రీవెంకటేశ అలమేల్మంగను నేను
అమరిన రతికడ్డమాడమయ్య