పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పై పట్టికలో నిలువు మొదటి వరుసల్లో ఉన్న అక్షరాలతో అడ్డం మొదటి వరుసల్లోని అక్షరాలను కలుపుతూ ఏవి అర్ధవంతమైన పదాలుగా వస్తాయో ఆ అక్షరాలను గదుల్లో నింపాలి. విడిగా వాక్యాలలో ప్రయోగించాలి. ఉదాహరణకు ఒకటవ పట్టిక చూద్దాం. 1వ పట్టికలో నిలువు ఒకటో నెంబరు వరుసలోని అక్షరాలను అడ్డం 1వ నెంబరు వరుసలో అక్షరాలు కలిపితే వచ్చే పదాలు మొదటి వరుస "కా” కు కలిపి చూద్దాం . కాచు, కాటు, కాపు, కాగు, కాదు, కాను, కాము, కారు, కాలు, నీరు కాచుకొంటారు. పాము కాటు వేస్తుంది. చెట్టు కాపుకు వచ్చింది. నీళ్లు కాగుతున్నాయి. తీపి ఆరోగ్యానికి మంచిదికాదు. నేను చెడ్డదాన్నికాను. మేము ఈ వూరి వాళ్లము కాము. కారులో ఊరికి వెళ్లాము. కాలు నొప్పిగా ఉంది.

పిల్లలు అర్జాలు విడిగా చెప్పలేకపోతే టీచర్‌ వాక్యంలో ప్రయోగించి అర్ధం అడగాలి.

పట్టికలో అడ్డం వేరే అక్షరాలు ఉపయోగించి మళ్ళీ కొత్త పదాలు సృష్టించవచ్చు. నిలువు అక్షరాలు మార్చి కొత్త పదాలు సృష్టించవచ్చు - ఇలా వందల పట్టికలు తయారవుతాయి.

5.అంత్య ప్రాసలతో అటలు

అక్క | తుక్కు | అన్న |కన్ను| అట్ట |అట్టు| నక్క| చెక్కు | నిన్న| తున్ను |కట్ట |పుట్టు| చక్క| పొక్కు | మొన్న| జున్ను| తట్టు| చెట్టు\

ఈ పట్టికలో ఉన్నట్లు బోర్డు మీద రాసి పిల్లల్ని తమ నోట్‌ పుస్తకంలో రాసుకొని వాటి కింద అలాంటి పదాలే రాయమని అడగాలి.

(అ)ఏకాంతంగా ఎవరికి వారు ఆలోచించి స్వయంగా ఠాయాలి.

(ఆ) ఇద్దరు లేదా ముగ్గుర్ని జట్టులుగా చేసి రాయమని చెప్పాలి.

(ఇ) పిల్లల్ని జట్లుగా చేసి జట్టుకు నెంబర్లు ఇచ్చి - ఒక్కో జట్టు నుండి ఒక్కొక్మరే వచ్చి ఏదోఒక పదంరాసి పొమ్మనాలి. జట్టులో ముగ్గురుంటే మూడు రౌండ్లు లేదా ఆరు రౌండ్లు రాసేవరకు ఆట సాగాలి. జట్టులో రాని పిల్లలకు నేర్పించి పంపవచ్చు.

6. ఇచ్చిన అక్షరాలతో మాత్రమే పదాలు తయారు చేయండి ప,క,డ,ం,ప - పడవ, పడక, పకపక, వడ, వండడం, వంపదం, వంక, వడకడం, కడవ, కండ, కడ, కంప, కడప,

| తెలుగుజాతి పత్రిక జుమ్మనుడి ఈ మార్చి-2021 |

7. ఇచ్చిన అక్షరాలు, వాటి గుణింతాలు వత్తులతో పదాలు చేయండి. మ,క-మామ,మమ్ము మిమ్ము మేము,ముక్కు మేకళ,మైకా, మొక్కు మెక్కుమాకు, కాక, కాకి, కేకు, కోక, కైక, కుక్క కిక్కు కూకో, కక్కు కామా, కమ్ము, కమ్మీ, కొమ్ము, మమ్ము, కైమా- కేవలం రెండక్షరాలతో ఇన్ని పదాలా అని ఆశ్చర్యపోతారు.

8.రెండక్షరాల ప్రాస : పదం చివర రెండక్షరాలు మారకూడదు. మొదటి అక్షరం మార్చి మరిన్ని పదాలు రాయండి.

పీపాలు నేపాలు

గొడుగు అడుగు

అమల కమల

అలుగు కలుగు

అరుగు నలుపు వరుగు తెలుపు

9. ఇచ్చిన అధారంతో అక్షరాలు పూరించండి

ప_ వ (నీటిలో ప్రయాణిస్తుంది.)
ప_ఫు (ఒక రంగు)
ప_లు (రాత్రి కాదు)
_ నస (ఒక పండు)
పం - (ఒక జంతువు)

ఏవైనా మంచి విషయాలు, విజ్ఞానదాయకమైన విషయాలు ఆసక్తిగా చెప్పాలనుకున్నప్పుడు ఆధారంతో కనుక్కోమని అడగవచ్చు. ఉదా౹౹ _______కూరలు (ఈ కూరలు తింటే రక్తం ఉత్పత్తి అవుతుంది. క్యా______ ( ఈ దుంప తింటే కంటికి మంచిది)

విశ్లేషణ - చదువులో ఆసక్తి ఉండాలి. తెలుసుకోవాలనే కుతూహలం కల్పించాలి. ఎప్పుడైతే కుతూహలం పుడుతుందో ఆలోచిస్తారు. అన్వేషిస్తూ ఆలోచిస్తే ఆనందం కల్గుతుంది.

ఆకలి తీర్చుకోడానికి ఆహారం సంపాదిస్తే సరిపోదు. దాన్ని తినాలి. మన పిల్లలు అక్షరాలు పదాలు నేర్చుకుంటారు. చదవడం నేర్చుకొంటారు. కాని వాటిని ఆనందంగా వినియోగించుకోరు. నేర్చుకొన్నందువల్ల ఉపయోగం ఏమిటి?

చూచిరాత, ఉక్తలేఖనం(డిక్టేషన్‌) వంటి సంప్రదాయ పద్దతులను కూడా క్రీడలుగా మలచవచ్చు. విషయ జ్ఞానాన్నీ పజిల్స్‌ ద్వారా వినోదపూర్వకంగా నేర్చవచ్చు. పజిళ్లు ఎలా తయారు చేయాలో చూచిరాత డిక్టేషన్లూ ఎలా అటలుగా ఆడించవచ్చో వచ్చే సంచికలో 3వ భాగంలో చూడండి.