పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాన్చించుటకు ప్రయత్నములు సలుపవలెను.” జాతీయోద్యమం పట్ల త్వీవంగా ఆకర్షితురాలైన అన్నపూర్ణమ్మ ఆంధ్రలో జరిగిన ఉప్పుసత్యాగ్రహం పట్ల మిక్కిలి సంతృప్తిని ప్రకటించింది. అందునా వైశ్యులు అందులో పాల్గొనడంతో ఆమె ఆనందానికి మేరలేకపోయింది. “వైశ్యులలోననేకులు ఈ యుద్యముమునకు సహాయుము చేయుచున్నారని వినుటకు ఎంతయో ఆహ్హాదకరముగనున్నది. గుంటూరు పట్టణమందు వైశ్యులలో ఇరువదిమంది పురుషులును, ఒక స్త్రీ శ్రీమతి కాళంగి శేషమాంబగారును జైలుకు వెళ్ళుటకు సంసిద్దులై వాలంటీరులుగా చేరినందుకు ఎంతయు సంతసము గలుగుచున్నది. ఆరు లక్షలమంది వైళ్యులలో నారీమణులు స్వరాజ్యోద్యమమునందు పాల్గొనలేదను నిందను బాపిన శ్రీమతి కాళంగి శేషమాంబగారు ఎంతయు స్తోత్రార్డులు....... ప్రస్తుత ఉద్యమ తీవతనుబట్టి కొలదికాలములో వైశ్యులందరును ఈ యుద్యమమునందు పాల్గొనులాగున కనుబడుచున్నది” అని మిక్కిలి సంతోషాన్ని వెలిబుచ్చింది.

"గాంధ్యవతారము” అనే వ్యాసంలో కలియుగంలో జన్మించిన గాంధీ అవతారము రామావతారము, కృష్ణావతారముల కన్నా “గొప్పది” అని విశ్లేషించింది అన్నపూర్ణమ్మ. గాంధీ అహింసా సిద్ధాంతంలో బలంగా నమ్మిన ఆమె రావణాసురుని, వాని అనుచరులను చంపక ధర్మప్రవర్తనులుగా జేసియుండిన యెడల రామావతారమును ఇంకను గొప్ప అవతారముగ భావించియుండమా? కౌరవులను నాశనము చేయక తన శిష్యులుగా మార్చియుండిన యెడల కృష్ణావతారము యత్యుత్తమమని భావించియుండమా?” అని ప్రశ్నించింది. త్రేత, ద్వాపర యుగాలకంటే కలియుగంలో “అధర్మము” ఎక్కువగా ఉందనీ, అయిననూ హింసను ప్రయోగించక “కలము, నాలుక” అనే రెండు ఆయుధములను వాడి “ధర్మ సంస్థాపన” కొరకు గాంధీ పాటుపడుతున్నాడనీ, ఆయనముందు శత్చపక్షంవారి “పశుబలము, సైన్యము, ధనము” నిరుపయోగమవుతున్నాయని తెలియజేసింది.హింసకూ అహింసకూ మధ్య జరుగుతున్న సమరంలో చివరకు “ఆధ్యాత్మిక బలమే జయము గాంచుచున్నది. శత్రుపక్షము క్రోధమును మాని గాంధీగారి శిష్యవర్గములో చేరవలనిన అవనరము కనబడుచున్నది. ఇట్టి ఆధ్యాత్మిక శక్తిని గనుపరచిన గాంధి అవతారము పూర్వపు అవతారములకంటే గొప్పదిగదా!” అనీ గాంధీ పట్ల తనకున్న ప్రగాఢమైన అభిమానాన్ని చాటుకున్నది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

33