విద్వావంతులును, స్వతంత్రులును అయిన స్త్రీలు తమ పుత్రులను, భర్తలను థైర్యశాలులుగను, దేశభక్తులుగను, చేయుదురని వేరే చెప్పవలసిన అవసరము లేదు” అని స్త్రీలు పురుషులకందివ్వగల తోడ్పాటును వివరించింది. “హిందూదేశము తిరిగి ప్రపంచములో గౌరవస్థానమును అలంకరించునట్లు చేయుట స్త్రీపురుషుల కర్తవ్యమై యున్నది.” అని భారతదేశం పూర్వం అనుభవించింది అనుకొన్న ఔన్నత్యాన్ని తిరిగి సంపాదించడంలో స్త్రీ-పురుషుల బాధ్యతను గుర్తుచేసింది. స్త్రీలకు “పతిభక్తి మాత్రమే చాలద”ని నినదించిన అన్నపూర్ణమ్మ “అత్మబలము, దేహబలము, దేశభక్తి, దైవభక్తి మొదలైన అనేక శక్తులను సంపాదించుటకు” స్రీలకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా “పతిభక్తి తప్ప మరేమియు కూడదనే పురుషులను స్త్రీలు గౌరవించు కాలము పోయినది” అని పురుషులను హెచ్చరించింది. గాంధీ, నెహ్రూ, లజ్‌పత్‌రాయ్, సరోజినీనాయుడు, అనిబీసెంట్ మొదలైన “ఆదర్శప్రాయులై”న నాయకుల్లాంటివారు “అసంఖ్యాకంగా” దేశంలో జన్మించాలంటే, స్త్రీలకు పురుషులతోపాటు అన్ని రకాల హక్కుల్నీ యివ్వాలని డిమాండు చేసింది.
అన్నపూర్ణమ్మ ఘోషా బురఖా పద్దతులు నిరసించింది. ఘోషా వలన “*స్వేచ్చగ బాహ్య విషయవులందు జోక్యము కలిగించుకానుటకు వీలుండదు” అనీ, దానీ వలన “అసమర్థత” కలుగుతుందనీ “అసమర్ధతే అజ్ఞానము” అనీ తెలిపింది. దీనివల్లనే స్త్రీలు మౌడ్యులుగా చిత్రీకరింపబడుతున్నారని విశదపరచింది.“ప్రపంచమందుండు ఱాయి -రప్ప, చెట్టు-చేమ, గొడ్డు -గోద ప్రతివస్తువును సూర్యరశ్మినుండి ప్రాణశక్తిని గ్రహించుచున్నవి. బురఖా థరించుటవలన సూర్యరశ్మి తగులక రక్తహీనులును, బలహీనులును యగుచున్నారు” అని ఘోషా-బురఖా వల్ల కలిగే ఆరోగ్యపరమైన చెడుగుల్ని తేటతెల్లం చేసింది.
వేశ్యావృత్తి “ప్రజాకంటకమైనది” అని ఎలుగెత్తి చాటిన అన్నపూర్ణమ్మ దాన్ని నివారించడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చి, ఆదిశగా కృషిచేస్తున్న డాక్టర్ ముత్తులక్షీరెడ్డిని బహుధా ప్రశంసించింది.
అస్పుశ్యతను నివారించడం “ముఖ్యావసరము”గా భావించినఅన్నపూర్ణమ్మ “అస్పృశ్యుల "ను హీనంగా చూసే “అగ్రవర్జా" లను నిందించింది. “నిమ్న జాతులయందుండు అనహ్యకరములగు అలవాట్లకు అగ్రవర్ణములవారే కారణభూతులు. వారిని చేరదీయక, గ్రామములందు నివసించుటకు అనుమతించక, దేవాలయములలో పూజలు చేసుకొనుటకు ఉత్తరువునివ్వక, అధమాధములనుగా చూచుచున్నాము” అని అగ్రవర్ణాల దుష్ట ప్రవర్తనను బట్టబయలు చేసింది. అగ్రవర్ధాలు పెట్టే “బాధలు పదజాలక” దళితులు క్రైస్తవం లేదా ఇస్తాంలలోకి మారి సౌభ్రాతృత్వాన్ని అనుభవిస్తున్నారని తెలియజేస్తూ “కైస్తువంటి, మహమ్మదువంటి దయాళుడైన బుద్దభగవానుడు మన దేశమున బుట్టలేదా?” అని నిష్ణూరముగా ప్రశ్నించింది. అందరినీ సమానంగా చూడమని బుద్దుడు చెప్పాడనీ, కానీ అతని ప్రవచనాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోయి కార్యాచరణలో ఉండడం లేదనీ వాపోయింది. ప్రస్తుత కాలంలో గాంధీ మహాత్ముడు అస్పృశ్యతా నివారణకోనం తీవ్రంగా కృషి చేస్తున్నాడని ప్రశంసించింది.
వర్ణవ్యవస్థను నిరసించిన అన్నపూర్ణమ్మ సహపంక్తి భోజనాల్లో శ్రద్ద కనబర్చేది. బ్రాహ్మణులు మొదలు దళితుల వరకు అందర్నీఒకే విధంగా ఆదరించేది. బంధువులు నివారించినా వినకపోయేది. పనిమనుషులు సహపంక్తి భోజనానికొచ్చిన వివిధ కులాల “అతిధుల విస్తళ్ళను, ఎంగిలి పాత్రలను” శుభ్రం చేయడానికి నిరాకరించినపుడు,ఆ పనులను తనే చేసేది. “జాతిమత ఖేదములేక సహపంక్తి భోజనములలో పాల్గొనినగాని, హైందవ సంఘమందలి దురాచారములు అంతరించి వేులుకలగద”ని ఆమె నొక్కి చెబుతుండేది.
రెండు భాగాలుగా రాసిన “జాతీయత” అనే వ్యాసంలో ప్రజలకుండే వివిధ అస్తిత్వాలను గూర్చి చర్చించిన అన్నపూర్ణమ్మ వాటిలో విశిన్ళమ్టైన అస్తిత్వమేదో తెలియజేసింది. ప్రజలకు కులాభిమానము, మతాభిమానము, దేశాభిమానము ఉండవచ్చనీ, కానీ దురభిమానం మాత్రం ఉండకూడదని తెలిపింది. “ఒక కులము ఎంత ఉన్నత దశయందున్నను పరకులస్తులను నిరసించుటగాని, ద్వేషించుటకాని కూడదు.” అని చక్కటి సూచనచేసింది. కుల,మతాభిమానాలకంటే దేశాభిమానము మెరుగైనదని స్పష్టం చేసింది. దానికన్నా “మానవ జాత్యాభిమానము సరొత్కృష్టమైనది. ఇట్టి యభిమానముగలవారు ఒక దేశస్తులనిగాని, ఒక మతస్తులనిగాని, నల్లవారనియు, తెల్లవారనియు. భేదము చూపరాదు. ఒక దేశము మఱియొక దేశముపై విరోధము వహించుట, దానిపై దండెత్తుట, అపజయమునుగాంచిన దేశమును నానా బాధలుపెట్టి హింసించుటమొదలగునవి అసహ్యకరములుగను పాపభూయిష్టమైనవిగను భావించి” న అన్నపూర్ణమ్మది విశాలమైన అంతర్జాతీయ దృక్పథం.
భారతదేశానికున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జాతీయవాదం యొక్క అవసరాన్ని ప్రబోధించింది అన్నవూర్ణమ్మ. ప్రజలు కులమతాలకతీతంగా ఏకమై దేశ స్వాతంత్రంకోసం పాటుపడాలని పిలుపునిచ్చింది. దేశంకోసం అందరూ ఒక్క తాటిపై నడవాల్సిన సమయంలో ఏ కులానికాకులం “ఎవరికి వారే యమునాతీరే” అన్నట్లు ప్రవర్తిస్తే “గొప్ప పొరపాటు చేసిన వారగుదుము” అని హెచ్చరించింది. భారత జాతీయోద్యమంలో పాలుపంచుకోమని వైశ్యులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చి వారు ఏవిధంగా దేశ స్వాతంత్రోద్యమంలో సహాయపడవచ్చునో తెలియజేసింది. “విదేశ వస్తు వ్యాపారము మాని స్వదేశ వస్తువులను అమ్ముట, దానథర్మములకు ఉపయోగపెట్టదలంచిన ద్రవ్యమును స్వరాజ్యోద్యమమునకు ఖర్చుపెట్టుట, యువకులు వాలంటీరులుగా చేరుట, ప్రచారము కొందరు బయలుదేరి ప్రతి గ్రామము పర్యటనము చేయుచు గ్రామవాసులకు దేశపరిస్థితులను స్వరాజ్యోద్యమము యొక్క మూల సూత్రములను బోధించుట, సంఘసంస్కరణ విషయములను గూడ బోధించవచ్చును. త్రాగుడు
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021
32