ఈ పుట ఆమోదించబడ్డది
485
- చిప్పబూరగడ్డి
- - నీళ్ళలో నాలుగడుగులెత్తు వరకు పెరుగును. ఇది నీళ్ళమీద తేలు చుండును. గింజలు తెలుపు.
- చంగలి
- - నేల మీద బ్రాకు చుండును. ఆకులు చిన్నవి. అంచుల వద్ద మెత్త్ని రోమములు గలవు.
- చీపురు గడ్డి
- - రాతి ప్రదేశములందు బెరుగును. కాడ గుండ్రముగ రెండు మూడడుగులెత్తు పెరుగును. దీని కాడలే చీపురు. దీని ముండ్లే దీనికి విత్తనములు.
- ఉడత తోక గడ్డి
- - పచ్చిక బయళ్ళలొ పెరుగును. ఆకులు మెండుగా గలవు.
- శంఖిణి గడ్డి
- - ఒకటి రెండడుగులెత్తు పెరుగును. కాడయు ఆకులును బిరుసుగా నుండును. అల్ప కణిశములు మూడేసి గలవు. మధ్య దానికి కాడ లేదు.
- ఎడ్డి గడ్డి
- - కాడ బల్లపరుపుగానుండును. ఆకులు కాడకు రెండు వైపులనేయుండును. కంకి మీద అడుగున పురుష యల్ప కణిశములు గాని, నపుంసకములుగాని యుండును. పైన, మ