పుట:VrukshaSastramu.djvu/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

485

చిప్పబూరగడ్డి
- నీళ్ళలో నాలుగడుగులెత్తు వరకు పెరుగును. ఇది నీళ్ళమీద తేలు చుండును. గింజలు తెలుపు.
చంగలి
- నేల మీద బ్రాకు చుండును. ఆకులు చిన్నవి. అంచుల వద్ద మెత్త్ని రోమములు గలవు.
చీపురు గడ్డి
- రాతి ప్రదేశములందు బెరుగును. కాడ గుండ్రముగ రెండు మూడడుగులెత్తు పెరుగును. దీని కాడలే చీపురు. దీని ముండ్లే దీనికి విత్తనములు.
ఉడత తోక గడ్డి
- పచ్చిక బయళ్ళలొ పెరుగును. ఆకులు మెండుగా గలవు.
శంఖిణి గడ్డి
- ఒకటి రెండడుగులెత్తు పెరుగును. కాడయు ఆకులును బిరుసుగా నుండును. అల్ప కణిశములు మూడేసి గలవు. మధ్య దానికి కాడ లేదు.
ఎడ్డి గడ్డి
- కాడ బల్లపరుపుగానుండును. ఆకులు కాడకు రెండు వైపులనేయుండును. కంకి మీద అడుగున పురుష యల్ప కణిశములు గాని, నపుంసకములుగాని యుండును. పైన, మ