పుట:VrukshaSastramu.djvu/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

486

ధ్య స్త్రీ యల్పకణిశము దానికిరు పక్కల పురుష అల్పకణిశము గలవు. స్త్రీ అల్పకణికమునకు కాడ లేదు.

వంశము.

వివృతబీజవంతము.

(దేవదారువంశము)

దేవదారుచెటేటును, ఇట్టి యితరచెట్లును మన దేశములో అంతగా బెరుగుట లేదు. ఆపెరుగునవి కొన్నియు పర్వతముల మీద పెరుగుచున్నవు. అవి శీతలప్రదేశములలో గాని వర్థిల్ల జాలవు. పూర్వ కాలమునందీ చెట్లే ప్రపంచమునండంతటను ఎక్కువగా నుండెడివి. వానిలో కొన్ని కుటుంబము లిప్పుడు పూర్తిగ అంతరించి పోయినవి. మరి కొన్ని మిక్కిలి తక్కువగనున్నవి.

ఈ చెట్లు మిక్కిలి ఎత్తుగా పెరుగును. వాని ఆకారమును అందముగా నుండును. కొమ్మలు మాను మీద అక్కడ నుండి, ఇక్కడ నుండి బుట్టి వంకర టింకరగా పెరుగక, ప్రతి కణుపు సందునందుండియు బుట్టుచు సరిగా పెరుగును. వీని ఆకులు మిక్కిలి తీసి పోయి యున్నవి. ఆకులలో రెండురకములుగా వచ్చుచున్నవి. కొన్ని చిన్నవి గాను పొలుసుల వలె నుండును. పొలుసుల మధ్య నుండి గుత్తులుగా సన్నని ఆకు పచ్చని ఆకులు పొడుగు పాటివి వచ్చుచున్నవి.