పుట:VrukshaSastramu.djvu/487

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

483

డుగులవరకు కూడ పెరుగును. వేరులోతుగా పారియుండును. ఆకులు సన్నముగాను బొడుగు గా నున్నవి. వాని అంచులు గరుకు. రెమ్మ కంకి కొమ్మల చివరనుండి, ఒకటి, రెండడుగులు వ్యాపించి యుండును. అల్ప కణిశములు జతలు జత్లుగా నున్నవి. ఒక దానికి కాడ గలదు. రెండవదానికి లేదు. దీని ఆకులను మెలి వేసి త్రాళ్ళను చేయుదురు. ఇది ఇండ్ల మీద కప్పుటకు ఉవయోగించును. ముదురు కా డల తో కలములు చేసి వ్రాసెదరు. దీనిని పశువులు తింవు గాని మిక్కిలి లేత మొక్కలను గేదెలు తినును.

ఆరింగ
-తేమ నేలలందైదుఅడుగులెత్తు వరకు బెరుగును. దీనిని పశువులు తినవు.
రేవ గడ్డి
- సార వంతమగు నేలలందు నాలుగైదు అడుగులెత్తు మొలచును.
పుత్సంగలి
చెట్ల క్రింద డొంకలవద్ద పెరుగును. ఇది నేల మీద ప్రాకుచునే యుండును. ఆకులు గరుకుగా నుండును. పురుష పుష్పమునకు మీసము లేదు గాని మిధున పుష్పమునకు గలదు.
తుమ్మగరిక
-నేలమీద ప్రాకుచునేయుండును. ఆకులు చిన్నవి నున్నగానే యుండును.