పుట:Thittla gnanam.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రములలో క్రిందిచక్రమైన గుణచక్రము బ్రహ్మనాడియందు ఆరవ నాడీకేంద్రమైన ఆగ్నేయస్థానమున ఉన్నది. ఆగ్నేయ నాడీకేంద్రము మెదడు మధ్యలో కనుబొమల మధ్యన గలదు. పై చక్రమైన బ్రహ్మచక్రము, మెదడు పై భాగమైన సహస్త్రార నాడీకేంద్రమున గలదు. మిగత రెండు చక్రములైన కర్మచక్రము, కాలచక్రములు ఆగ్నేయ కేంద్రమునకు, సహస్త్రార కేంద్రమునకు మధ్యలో గలవు. జ్ఞాననేత్రమునకు తెలియబడే ఆ చిత్రము ఈ విధముగ ఉన్నది. క్రింది పటములలో చూడుము.

Brahma,Kaala, Karma chakra's position in Head.
Brahma,Kaala, Karma chakra's position in Head.

మనిషి మెదడులో గల గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రములనబడు నాల్గుచక్రములలో క్రింది చక్రము గుణచక్రము. ఆ గుణచక్రమును వివరించుకొని చూస్తే, అందులో గుణములున్న భాగములు మూడు, గుణములులేని భాగము ఒకటి గలదు. మొత్తము నాలుగు గదులుగా గుణచక్రము విభజింపబడి ఉన్నది. అందులో బయటినుండి లోపలికి మొదటది తామస గుణభాగము, రెండవది రాజస గుణభాగము, మూడవది