పుట:Thittla gnanam.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్గము, వర్ణము అను పదములు ఏర్పడినవి. వీటన్నిటికి అర్థము వరసలు అనగ వేరు వేరు క్రమముగా కనిపించుచున్నవివని, వర్గములు అనగా వేరు వేరు గుంపులని, వర్ణములు అనగా వేరువేరు రంగులని చెప్పవచ్చును. వర్ణమ్‌ అను పదమునకు ముందు చతుర్‌ అని చెప్పుటవలన నాలుగు రంగులని చెప్పవచ్చును. సందర్భానుసారము ఇంకా వివరముగా చెప్పుకొంటే నాలుగు వేరు వేరు విధములుగా ఉన్నవని చెప్పవచ్చును. ఇప్పుడు తిట్టుగా చెప్పుకొన్న పదములో "చవితి" అను పదము ఉండుటవలన దానిని గురించే విశేషముగా చెప్పుకోవలసియున్నది. 'విదియ' అనగా రెండవదని, 'తదియ' అనగా మూడవదని, చవితి అనగా నాల్గవదని అర్థము చేసుకోవచ్చును. ముందు యుగములలో "చవితి" అను శబ్దము ఆత్మజ్ఞానము కల్గినదై ఉండుట వలన దాని వివరము ఇలాగున్నది.


భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమందు మొట్టమొదటి శ్లోకమున మొదటనే "ఊర్ధ్వమూలమ్‌" అను పదము గలదు. జీవితమునకు గల మూలము శరీరమునకు పైన గల తలయందున్నదని, ఆ పదమునకు అర్థము. శరీరమునకు పైన శిరస్సుగలదు. ఆ శిరస్సులోపల కనిపించే మెదడుయందు కనిపించని మూలమున్నదని భగవంతుడు చెప్పాడు. ఇటు భౌతికశాస్త్రవేత్తలకు, అటు విజ్ఞానులకు తలయందు కనిపించే మెదడున్నదని తెలుసు, కానీ కనిపించని మూలమేమిటో తెలియదు. ఆ మూలమునే భగవద్గీత జ్ఞానయోగములో 13వ శ్లోకమున "చాతుర్వర్ణమ్‌" అని చెప్పాడు. శిరస్సు మధ్యభాగములో కనుబొమల మధ్యభాగమునుండి దాదాపు ఒకటి నుండి ఒకటింపావు అంగుళము పొడవుతో నాలుగుచక్రములు బ్రహ్మనాడి శక్తిని ఇరుసుగ (ఆధారముగ) చేసుకొని తిరుగుచున్నవి. ఆ నాలుగు