పుట:Thittla gnanam.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాత్త్విక గుణభాగము, నాల్గవది గుణములేని ఆత్మ భాగము. భూమిమీద పుట్టిన జీవుడు ఎవడైనాగానీ ఈ నాలుగు భాగములలోనే ఉండును. మొదటి భాగములో ఉన్న జీవున్ని ఆ గుణభాగమునుబట్టి తామసుడనీ, రెండవ భాగములోనున్న జీవున్ని రాజసుడనీ, మూడవ భాగములోనున్న జీవున్ని సాత్త్వికుడనీ, నాల్గవ భాగములోనున్న వానిని యోగి అని అనుచుందురు. మొదటి మూడు భాగములలో గుణములుండగ, చివరి నాల్గవ భాగములో ఆత్మ గలదు. అందువలన ఆత్మస్థానములో చేరిన జీవున్ని యోగి అని అనుచున్నాము. గుణచక్ర నాల్గు భాగములను క్రింది పటములలో చూడుము.


యోగి అయినవాడు గుణచక్రములోని నాల్గవస్థానములో ఉంటాడు. కావున వానిని నాల్గవవాడని, చవితియని అనడము పూర్వముండెడిది. ప్రథమ (పాడ్య), విదియ, తదియ, చవితి అను నాలుగు పేర్లు వరుసగ తామస, రాజస, సాత్త్విక, యోగులకు వర్తించెడివి. గుణచక్రములో మొదట తామసుడు అజ్ఞాని, అందువలన వానిని మౌడ్యముగలవాడని అనెడివారు. మౌడ్యము అను పదము ఎలా వచ్చినదనగా? ప్రథమ అను శబ్దము పాఢ్యమి

Jeevatma in Tamasa position
Jeevatma in Tamasa position