పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవ ! యిచ్చట నే మీదివ్యశ్రీపాద సేవఁ జేయుచునుందుఁ జనఁగ నేనొల్ల మనుజేశ నామది మట్టినిల్వదచట యనవుడు రఘు రాముఁ డతని కిట్లనియె * ఆరయ మాస్వామి యగుచున్న యట్టి శ్రీరంగధాము నిచ్చెద నీవుగొమ్ము పోయి నీవందు నెప్పుడు పూజ సేయు మాయందు భక్తియు మజువకు మెపుడు ననుచు శ్రీరంగనాయకు నిచ్చె వేడ్క ననలొ త్త శ్రీరంగనాయకుఁ గొనుచు: జనియే లంకకు........ 842 పుట పై దానిని పరిశీలింపగా శైవులు శివప్రతిష్ట * రాముఁడు చే సెనని చెప్పగా వైష్ణవులు శ్రీరంగనాథుని ప్రతిష్టిం చేనని మూలరామాయణమున నీఘట్టమును ప్రకి ప్తము చేసిరా యను సం దేహము కలుగు చున్నది. ఇందు చేత నే శ్రీరంగ మహాత్మ్య మున రామాయణ కథ ప్రసక్తమగుచున్నది. సంస్కృత రామా యణమునకు గోవిందరాజుల వారు వ్రాసిన విశిష్టాద్వైత పర మగు వ్యాఖ్యగూడ వీని రచనకు దోహదమునొసంగి గుండ వచ్చును.

  • శివలింగ ప్రతిష్ఠ చేయుటవలస శ్రీరాములవారికి రావణుని చంపినందువలస గలి)న బ్రహ్మహత్యా దోషము నివారణ మైనదని శైవగ్రంథములు వాకొను చున్నవి. • ఆత్రపూర్వం మహాదేవ ప్రతిష్ఠామక రోద్విభుః అను వాల్మీకి రచ నమే దీనికి మూలము.